పోక్సో కేసులో వ్యక్తికి 25 ఏండ్ల జైలు

పోక్సో కేసులో వ్యక్తికి 25 ఏండ్ల జైలు

బషీర్​బాగ్, వెలుగు: ఎస్సీ బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో వ్యక్తికి 25 ఏండ్ల కఠిన కారాగార శిక్ష పడింది. 2023లో సైఫాబాద్​ పీఎస్​ పరిధిలోని ఎస్సీ బాలికపై ఇంట్లోకి వెళ్లి గుట్ల శ్రీనివాస్ (40) అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఆధారాలను పరిశీలించిన నాంపల్లి 12వ అడిషనల్ సెషన్స్ జడ్జి తమ్మినేని అనిత శుక్రవారం తీర్పు వెలువరించారు. నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 25 ఏండ్ల కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించారు.