పిట్టను కొట్టబోతే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు తాకింది.. వ్యక్తి అరెస్ట్

ఓ వ్యక్తి  గులేరులోని రాయితో  పిట్టను కొట్టబోతే అది పొరపాటున వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు తాకింది.  దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.  ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే ...  జనగామకు చెందిన హరిబాబు పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుంటుంటాడు.  

 అందులో భాగంగా డిసెంబర్ 30 శనివారం రోజున పిట్టలు కొట్టడానికి ప్రయత్నించగా అది కాస్త విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళుతున్న 20833 నంబరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు తగలింది. ఈ ఘటనలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు అద్దం పగలడంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో  విచారణ జరిపారు. 

దీనికి కారకుడు హరిబాబు అని తేలడంతో గులేరును సీజ్‌ చేసి ఆయనను అరెస్టు చేశారు. అయితే అది పోరపాటన తాగిందని, అందులో తన తప్పేమీ లేదని పోలీసులకు మొరపెట్టుకున్నాడు.