మెదక్ ఎంపీ, ప్రస్తుతం దుబ్బాక్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. 2023, అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం.. ఆయన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రచారంలో చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్లందరినీ తోపుకుంటూ.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై.. కత్తితో హత్యయత్నం చేశాడు. విషయాన్ని వెంటనే గమనించిన సెక్యూరిటీ గార్డులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అతన్ని అడ్డుకున్నాయి.
దాడి చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇంకా వెల్లడి కాలేదు. దాడి చేసిన వ్యక్తిని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి గాయం అయినట్లు తెలుస్తుంది. సూరంపల్లి నుంచి గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లారు.
(దాడికి కారణాలు ఏంటీ.. దాడి చేసిన వ్యక్తి ఎవరు.. ఎందుకు దాడి చేశాడు.. దాడిలో ఎంపీకి గాయాలు అయ్యాయా లేదా.. అసలు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉందిా )