
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. భాశెట్టి నాగరాజు అనే వ్యక్తి అధిక వడ్డీల ఆశ చూపించి సుమారు యాభై కోట్లు వసూలు వేసి బాధితులకు టోకరా వేశాడు. పది రూపాయల వడ్డీ ఆశ చూపి రాఘవేంద్ర నగర్ కాలనీలోని చుట్టూ ప్రక్కల కాలనీ వాసులు వద్ద సుమారుగా రూ.50 కోట్లు వసూలు చేశాడు నాగరాజు. ఒక్కొక్క వ్యక్తి నుంచి సుమారు రూ. 5 లక్షల నుండి రూ 20 లక్షల పైగా వసూలు చేశాడు. తిరిగి డబ్బులు ఇవ్వాలని బాధితులు అడిగితే 3 నెలలుగా అందుబాటులోకి రాలేదు నాగారాజు. దీంతో నాగరాజుపై కేసు నమోదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బాధితులు 2024 జూన్ 03వ తేదీ సోమవారం రోజున నాగరాజు ఇంటి ముందు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.