
పద్మారావు నగర్, వెలుగు: మహా కుంభమేళాను కొందరు తమ ఉపాధిగా మార్చుకుంటున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాను మిస్ చేసుకోవద్దని, ఈ అవకాశం మళ్లీ మన జీవితంలో రాదని, వ్యయ ప్రయాసల కోర్చి ప్రయాగ్‌రాజ్ దాకా వెళ్లడం కంటే ఉన్నచోటనే కుంభమేళా పుణ్యస్నాన ఫలాన్ని పొందవచ్చని ఓ వ్యక్తి రూపొందించిన పాంప్లెట్సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుంభమేళా పుణ్యస్నాన ఫలం పొందాలనుకునేవాళ్లు తమ ఫొటోను వాట్సాప్ చేస్తే, ఆ ఫొటోను ప్రింట్ అవుట్ తీసి ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమంలో ముంచి పుణ్య స్నాన తంతు నిర్వహిస్తానని చెబుతున్నాడు. దీనికి రూ.500 తీసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో పాంప్లెట్ ప్రకటనను చూసిన నెటిజన్లు మన దేశంలో ఏదైనా సాధ్యమే.. అంటూ నవ్వుకుంటున్నారు. ఇలాంటి మెసెజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని, ఇవి మన సేవింగ్స్‌ను ఖాళీ చేసే ఫ్రాడ్మెసేజ్లు అయి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.