కాళ్లు చేతులు కట్టేసి, ముఖానికి మాస్క్​ వేసి.. ఫ్యాన్​కు వేలాడదీసి యువకుడి హత్య

  • కుత్బుల్లాపూర్​లో ఘటన

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్​లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కడప జిల్లా తొండూరు మండలం గోటూరుకు చెందిన శివ కుమార్​రెడ్డి (26) ఉపాధి కోసం సిటీకి వచ్చి కుత్బుల్లాపూర్​లోని అయోధ్యనగర్​లో మరో వ్యక్తితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఉబర్, ఓలాలో టూ వీలర్ రైడర్​గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తోటి రూమ్​మెట్ ​బుధవారం నైట్ డ్యూటీకి వెళ్లగా, శివ ఒక్కడే ఒంటరిగా పడుకున్నాడు.

గురువారం ఉదయం ఎంత సేపటికి ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో.. ఇంటి ఓనర్​ స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా, ఫ్యాన్​కు వేలాడుతూ కన్పించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు క్లూస్​టీంతో ఆధారాలు సేకరించారు. తలకు మంకీ క్యాప్, నోరు, కాళ్లుచేతులు కట్టేసి యువకుడిని హత్య చేసినట్లు గుర్తించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.