ఇది యూనివర్సిటీ కాదయ్యా: వాట్సాప్ గ్రూపుల్లో సలహాలు.. ఇంట్లోనే మహిళ డెలివరీ

ఇది యూనివర్సిటీ కాదయ్యా: వాట్సాప్ గ్రూపుల్లో సలహాలు.. ఇంట్లోనే మహిళ డెలివరీ

వాట్సాప్.. ఇదో చాటింగ్ గ్రూపు.. కాకపోతే ఇది ఓ యూనివర్సిటీ అయిపోయింది.. ఎవరికి తోచిన సలహాలు వాళ్లు పడేస్తున్నారు.. ఇవే నిజం అనుకుంటున్న జనం లేకపోలేదు. వాట్సాప్ సమాచారం ఎంతలా మారిపోయింది అంటే.. చెన్నై సిటీలోని ఓ జంట.. ఇంట్లోనే డెలివరీ అయ్యింది. బిడ్డకు జన్మనిచ్చింది. వాట్సాప్ గ్రూపుల్లోని సూచనలు, సలహాలతో ఆ భర్త.. ఇంట్లోనే తన భార్యకు డెలివరీ చేశాడు.. ఏంటీ అవాక్కయ్యారా.. ఆశ్చర్యపోయారా.. దేశమే ఔరా అని నోరెళ్లబెట్టింది ఈ ఘటనతో.. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ALSO READ : అంతా తూచ్.. మోడీకి ఏం తెలియదు: కెనడా PM జస్టిన్ ట్రూడో యూటర్న్

పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన 36 ఏళ్ల ఎర్త్‌మూవర్ ఆపరేటర్ మనోహరన్, అతడి భార్య సుకన్య (32) కుండ్రత్తూరు సమీపంలోని నందంబాక్కంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. మూడోసారి గర్భవతి అయిన సుకన్యకు 2024, నవంబర్ 17వ తేదీన పురిటి నొప్పులు వచ్చాయి. భార్యను డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఓ వాట్సప్ గ్రూప్ సభ్యుల సూచనలు, సలహాల మేరకు ఇంట్లోనే భార్యకు పురుడు పోశాడు ఆమె భర్త మనోహరన్. ‘‘హోమ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్’’ పేరిట1000 మందికి పైగా సభ్యులు ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‎లో మనోహరన్ కూడా మెంబర్‎గా ఉన్నాడు. 

ఈ గ్రూప్‎లో ముఖ్యంగా హోమ్ డెలివరీలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఈ వాట్సప్ గ్రూప్ సభ్యుల సూచనలను ఇన్సిపిరేషన్‎గా తీసుకున్న మనోహరన్.. తన భార్యకు ఇంట్లోనే కాన్పు చేయాలని ఆమె గర్భవతి అయినప్పుడే డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే సుకన్యకు నెలలు నిండటంతో 2024 నవంబర్ 17న పురిటి నొప్పులు వచ్చాయి. భార్యకు ఇంట్లోనే డెలివరీ చేయాలని ముందే ఫిక్స్ అయిన మనోహరన్.. వాట్సప్ గ్రూప్ సభ్యుల సూచనలు, సలహాల ప్రకారం  భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా తన నివాసంలోనే డెలివరీ చేశాడు. 

ఈ విషయం ఆ నోట ఈ నోట పడి రీజియన్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‎కు తెలిసింది. అసలు విషయం తెలుసుకుని అవాక్క్ అయిన రీజియన్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‎ కుండ్రత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్య భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన మనోహరన్‎పై చర్యలు తీసుకోవాలని కోరారు. హెల్త్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మనోహరన్‎పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోమ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్' అనే వాట్సాప్ గ్రూప్‌ సూచనలు, సలహాల మేరకే మనోహరన్ భార్యకు హోం డెలివరీ చేశాడని పోలీసులు ధృవీకరించారు. ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.