- గుళ్లో కరెంట్ షాక్ తో యువకుడు మృతి
- మేడిపల్లిలోని కమలానగర్లో ఘటన
మేడిపల్లి, వెలుగు: గుడిలోకి వెళ్లేందుకు కాళ్లు కడుక్కుంటుండగా, కరెంట్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. మేడిపల్లి పీఎస్ పరిధిలోని కమలానగర్‌కు చెందిన ఒంటెద్దు సైదులు (33) ఆటో డ్రైవర్. సోమవారం స్థానికంగా ఉన్న శివాలయానికి వెళ్లి, బయట కాళ్లు కడుక్కుంటున్నాడు.
ఈ క్రమంలో వాటర్ టాప్కుఆనుకొని ఉన్న ఏవీ ఇన్ఫోప్రైడ్ అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్ వైర్లనుపట్టుకొని మృతి చెందాడు. అపార్ట్ మెంట్ వాసుల నిర్లక్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.