మందుపాతర పేలి వ్యక్తి మృతి

మందుపాతర పేలి వ్యక్తి మృతి

భద్రాచలం, వెలుగు: పోలీస్‌‌‌‌ బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఓ గ్రామస్తుడు చనిపోయాడు. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బార్సూర్‌‌‌‌ పీఎస్‌‌‌‌ పరిధిలోని కోశల్‌‌‌‌ నాయక్‌‌‌‌ అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు రెండు మందుపాతరలను అమర్చారు. మునారి అకాలి అనే గ్రామస్తుడు వెదురు సేకరణ కోసం అడవిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో మందుపాతరపై కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలింది. దీంతో మునారీ అకాలి శరీరం ముక్కలుముక్కలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు మునారీ డెడ్‌‌‌‌బాడీకి పోస్ట్‌‌‌‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.