బూరుగుపేట గ్రామంలో చేపల కోసం వెళ్లి వ్యక్తి మృతి

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు :  చేపల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు రామచంద్రు కుంటలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూరుగుపేట గ్రామ పరిధిలోని అందుగులామెదిలో జరిగింది. మృతుడిని రాములుగా గుర్తించారు. మృతుని తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజు తెలిపారు.