
మధిర, వెలుగు: రైలు లోంచి జారిపడి గుర్తుతెలియని యువకుడు మృతిచెందిన ఘటన మధిర, మోటమర్రి రైల్వే స్టేషన్ ల మధ్యన మంగళవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం.. మధిర-, మోటమర్రి రైల్వే స్టేషన్ ల మధ్య 25 ఏండ్ల యువకుడు ప్రమాదవశాత్తు రైలులోంచి జారిపడి చనిపోయాడు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మెరూన్ కలర్ షర్ట్ , బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. డెడ్బాడీని మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెలిసిన సంబంధికులు ఎవరైనా ఉంటే 8712658589 ఫోన్నంబర్ లో సంప్రదించాలని రైల్వే పోలీసులు సూచించారు. ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ భాస్కర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.