- ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి
నెక్కొండ, వెలుగు : మద్యం తాగొద్దని భార్య గొడవ పడడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బంజరుపల్లి శివారు ధర్మతండాకు చెందిన బాదావత్ వీరన్న (47) నిత్యం మద్యం తాగేవాడు. దీంతో మద్యం బంద్ చేయాలని భార్య రక్మీ గొడవ పడింది. మనస్తాపానికి గురైన వీరన్న 15 రోజుల కింద పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. భార్య రక్మీ ఫిర్యాదుతోన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.