అశ్వారావుపేట(భద్రాద్రికొత్తగూడెం), వెలుగు: పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానంటూ గిరిజనులను మోసం చేసి ఓ వ్యక్తి రూ.లక్షలు వసూలు చేశాడు. ఎస్సై రాజేశ్‌కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం.. అశ్వారావుపేట మండలం రమణక్కపేట అటవీ ప్రాంతంలో ఏండ్లుగా గొత్తికోయలు పోడు చేస్తున్నారు.
దమ్మపేట మండలం సరోజనాపురం గ్రామానికి చెందిన సామెల్ వారికి పట్టాలు ఇప్పిస్తానంటూ 12 కుటుంబాల నుంచి 2021లో లక్షల్లో వసూలు చేశాడు. అప్పటి నుంచి పట్టాల విషయమై సామెల్ని అడుగుతుండగా దాటవేస్తూ వచ్చాడు.
తాము మోసపోయామని గ్రహించి గురువారం ఊకే సురేశ్ అనే బాధితులుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.