కోల్బెల్ట్, వెలుగు : తాము మోసపోయామని, ఇండ్ల పట్టాలిప్పిస్తామని అధికార పార్టీ పట్టించుకోలేదని.. ఏ పార్టీ న్యాయం చేస్తుందో ఆ పార్టీకే ఓటు వేస్తామంటూ మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి గోడకు పోస్టర్ అంటించాడు. ‘మా ఇంట్లో 6 ఓట్లున్నాయి.
ఇండ్ల పట్టాలు లేవు. ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పించిన వారికే మా ఓటు. నేను ఏ పార్టీకి పక్షపాతిని కాను. ఏ పార్టీ న్యాయం చేస్తే ఆ పార్టీకే మా ఓటు. ఓటరు మారాడు.. మీరు కూడా మారండి. లేకుంటే ఓటమే. బోర్డును తొలగిస్తే ఇలాంటి ఇంకో 10 ఇండ్లకు కనిపిస్తాయి’ అంటూ పేర్కొన్నాడు. ఈ పోస్టర్సోషల్మీడియాలో వైరల్గా మారింది.