తమిళనాడులో ఘోరం.. కోర్టు ముందే లాయర్​పై కొడవలితో దాడి

తమిళనాడులో ఘోరం.. కోర్టు ముందే లాయర్​పై కొడవలితో దాడి

చెన్నై: కోర్టు ఎదుటే నడిరోడ్డుపై న్యాయవాదిని కొడవలితో నరికాడు ఓ వ్యక్తి. చుట్టూ అందరూ చూస్తుండగానే జరిగిన ఈ పాశవిక దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తల, ముఖంపై తీవ్ర గాయలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి సీరియస్​గా ఉంది. ఈ ఘోరం బుధవారం తమిళనాడులో కృష్ణగిరి జిల్లా కేంద్రంలో జరిగింది. బాధితుడిని కన్నన్​గా గుర్తించారు. కొడవలిలో దాడికి పాల్పడిన నిందితుడిని ఆనంద్ కుమార్​ను పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత శత్రుత్వమే ఈ దాడికి కారణమని తెలిపారు. కన్నన్​ వద్ద ఆనంద్ కుమార్ అసిస్టెంట్​గా పనిచేసేవాడు. 

కొన్నాళ్ల కింద వీరి మధ్య గొడవలు జరిగాయి. ​విషయం పోలీసు స్టేషన్​, కోర్టు వరకు వెళ్లింది. అక్కడ రాజీ చేసుకున్నారు. అయితే ఆనంద్​ ఉన్నట్టుండి కన్నన్​పై ఇలా కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిపై న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. డాక్టర్ల భద్రత కోసం చట్టం తీసుకొచ్చినట్టు న్యాయవాదుల రక్షణకు కూడా ఓ చట్టం చేయాలని డిమాండ్‌‌ చేశారు.