ఢిల్లీలో ఓ కారు యజమాని రెచ్చిపోయాడు. ఉద్దేశపూర్వకంగా బైకర్ను ఢీకొట్టి పారిపోయాడు. ఢిల్లీ అర్జన్ఘడ్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు కారు యజమానిపై కేసు బుక్ చేశారు.
బాధిత బైకర్ 10 మంది స్నేహితులతో కలిసి గురుగ్రామ్ నుంచి ఢిల్లీ తిరిగి వస్తుండగా ఓ కారు యజమాని వారికి చేరువగా వచ్చాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైకర్లను భయభ్రాంతులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా వారిని బెదిరించడంతో పాటు బూతులు తిట్టాడు. ఎందుకు తిడుతున్నావని బైకర్లు ప్రశ్నించగా మరింత రెచ్చిపోయాడు. తనను దాటి ముందుకు వెళ్లిన ఓ బైకర్ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడు. కారు ఢీకొట్టిన వేగానికి బైక్ పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ బైకర్ ప్రాణాలతో బయటపడ్డాడు.
#WATCH | A man hit a biker with his four-wheeler following a heated verbal exchange with the biker group, near Arjan Garh metro station in Delhi. (05.06)
— ANI (@ANI) June 6, 2022
Police say they've taken cognisance of the matter & investigation is on.
(Note: Abusive language)
(Source: Biker's friend) pic.twitter.com/ZHXdGil95z
ఈ మొత్తం వ్యవహారాన్ని మిగిలిన బైకర్లలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో తమ దృష్టికి రావడంతో ఫతేపూర్ బేరీ పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా కేసు నమోదుచేశారు.
మరిన్ని వార్తల కోసం..