కూల్​ డ్రింక్ ​ఆశ చూపి ఐదేండ్ల చిన్నారిపై అత్యాచారం

కూల్​ డ్రింక్ ​ఆశ చూపి ఐదేండ్ల చిన్నారిపై అత్యాచారం

జవహర్ నగర్, వెలుగు: కూల్​డ్రింక్​ఆశ చూపి ఐదేండ్ల చిన్నారిపై వలస కూలీ అత్యాచారానికి పాల్పడిన ఘటన జవహర్​నగర్​పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన దంపతులు ఆరేండ్లుగా జవహర్ నగర్​లో ఉంటున్నారు. 

స్థానికంగా కూలి పనులకు వెళ్తున్నారు. వీరికి ఐదేండ్ల పాప ఉంది. ప్రస్తుతం స్థానిక స్కూల్​లో యూకేజీ చదువుతోంది. వైర్ల కంపెనీలో పనిచేసే యూపీకి చెందిన పరమేశ్(30) వీరి ఇంటికి సమీపంలోనే ఉంటున్నాడు. తాగుడుకు బానిసవ్వడంతో వైర్ల కంపెనీ యజమాని పనిలో నుంచి తీసేశాడు. 

కాగా, ఆదివారం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి కూల్ డ్రింక్ కొనిస్తానని ఆశచూపి పరమేశ్​సమీపంలోని నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత పాపను అక్కడే వదిలేసి పారిపోయాడు. పని నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పాప పరిస్థితిని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాపను హాస్పిటల్​కు తరలించారు. నిందితుడిపై పోక్సో యాక్ట్​కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.