సెలూన్‌‌‌‌‌‌‌‌ను ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌గా మార్చిండు!

హైదరాబాద్‌: ఇంతకుముందు ఇదో ఫ్యామిలీ సెలూన్‌‌‌‌‌‌‌‌. కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో మూతబడింది. ఈ మధ్య సడలించినా వ్యాపారం సక్కగ నడవలేదు. దీంతో మూసేశారు. కానీ సెలూన్‌‌‌‌‌‌‌‌ ఓనర్‌‌‌‌‌‌‌‌ ఇంకో కొత్త బిజినెస్‌‌‌‌‌‌‌‌ ఐడియా వేశారు. కరోనా పేషెంట్ల కోసం ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రతి రూమ్‌‌‌‌‌‌‌‌కు అటాచ్డ్ బాత్రూమ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయించారు. వైఫై, హాట్ వాటర్ పెట్టించారు. 24 గంటలు అంబులెన్స్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టేషన్, మెడిసిన్ డెలివరీ, న్యూస్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డాక్టర్‌‌‌‌‌‌‌‌ కన్సల్టేషన్‌‌‌‌‌‌‌‌తో ఫుడ్‌‌‌‌‌‌‌‌ అందిస్తున్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఫిజీషియన్ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ అన్ని సర్వీసులకు గాను ఒక్కో రూమ్‌‌‌‌‌‌‌‌కు రోజుకు రూ. 10 వేలు చార్జ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. గురువారమే ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌ స్టార్టయింది. 48 గంటల్లోనే రూమ్స్ అన్నీ బుక్ అయ్యాయని, ఇంకిన్ని రూమ్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని సెంటర్‌‌‌‌‌‌‌‌ ఓనర్‌‌‌‌‌‌‌‌ సంపత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

ధనిక రాష్ట్రమే కానీ అప్పు రూ.2.90 లక్షల కోట్లు