
తూప్రాన్, వెలుగు: కూతురు వివాహం చేయలేని స్థితిలో ఉన్నానని మనస్థాపం చెంది హల్ది వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో సోమవారం ఈ ఘటన జరిగింది. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా కూతురు పెళ్లి చేయలేనని తెలిసి ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తూప్రాన్ మండలం నాగులపల్లి శివారులోని హల్ది వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.