అధిక వడ్డీ పేరుతో రూ.2 కోట్లు వసూలు చేసి జంప్

అధిక వడ్డీ పేరుతో రూ.2 కోట్లు వసూలు చేసి జంప్

లక్ష రూపాయలకు వేళల్లో వడ్డీ వస్తుందని అత్యాశ చూపిస్తూ కొంతమంది చప్పుడు లేకుండా జంప్ కొడుతున్నారు. డబ్బులు ఇచ్చిన బాధితులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. తాజాగా అధిక వడ్డీ పేరుతో 101 మందిని మోసం చేసి రూ. 20 కోట్లతో ఉడాయించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  స్థానికంగా ఉండే మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి వ్యాపారం చేస్తుంటాడు. అధిక వడ్డీ పేరుతో 101మంది దగ్గర రూ.20 కోట్లు వసూలు చేశాడు. అయితే గత వారం రోజుల నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడు. దీంతో  మోసపోయామని గ్రహించిన బాధితులు హయత్ నగర్ పోలీసులని ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎల్బీ నగర్ పీఎస్ కు కేసు బదిలీ చేశారు.   మధుసూదన్ రెడ్డి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. 

Also Read:విమానంలో అల్లకల్లోలం.. సీట్లలోని వారు లగేజీ బాక్సుల్లోకి ఎగిరిపడ్డారు..!