చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో లారీ కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి వివరాల ప్రకారం.. మెహిదీపట్నం పరిధిలోని ఆసీఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన లోకేశ్(40) ఓ యువతిని బైక్ మీద తీసుకుని చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చాడు. స్వామివారిని దర్శించుకున్న తరువాత అజీజ్‌నగర్ పాత గేట్ సమీపంలో హైదరాబాద్– బీజాపూర్ హైవేపై ఆమెను దించాడు. అనంతరం బైక్పైవెళ్తూనే లారీ వెనకాల చక్రాల కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు లారీ డ్రైవర్ వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దొంగతనం నేరం మోపడంతో మరొకరు..
మొయినాబాద్ మండలం చిన్నమంగళారం గ్రామానికి చెందిన మల్లేశ్(42) అజీజ్ నగర్ రెవెన్యూలో ఒకరి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 10 రోజుల కింద వారి ఇంట్లో దొంగతనం జరగగా, మల్లేశ్‌ను పోలీసులు రెండుసార్లు తీసుకెళ్లి విచారించారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఆ ఇంటి యాజమని ‘నువ్వే దొంగతనం చేశావు.. సీపీ వద్దకు వెళ్లి నీ పనిచేయిస్తా’ అంటూ మల్లేశ్ ను భయపెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్ శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.