ట్రాఫిక్​ చలాన్లు కట్టాలని పోలీసుల వేధింపులు..మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(52) వరంగల్ లోని ఓ బట్టల షాపులో పని చేస్తుండేవాడు. ప్రతి రోజూ తన స్కూటీపై పనికి వెళ్లివచ్చేవాడు.

అయితే మే 21న రోజులాగే వెత్తుండగా వరంగల్ చౌరస్తాలో మొగిలిని పోలీసులు ఆపారు. బండికి సంబంధించిన ప్రత్రాలు పరిశీంచి..17 పెండింగ్​చలాన్లు ఉన్నాయని.. వెంటనే కట్టాలంటూ స్కూటీని సీజ్ ​చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ముగిలి పురుగుల మందు తాగి సూసైడ్ ​చేసుకున్నాడు. ముగిలి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.