
కారేపల్లి, వెలుగు: ఆన్లైన్ గేమ్స్‌కు అడిక్ట్ అయ్యి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన చిండే నాగభూషణం (42) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఓ కోల్ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ వద్ద 15 ఏండ్లుగా గుమస్తాగా పని చేస్తున్నాడు. ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలాల సరిహద్దులోని ఓపెన్ కాస్ట్ కాటా సమీపంలోని రేకుల షెడ్డులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.