ప్రేమించిన అమ్మాయి.. పెళ్లికి నో అందని ఎలుకల మందు తాగిండు

ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో చోటుచేసుకుంది.  బత్తిని నిఖిల్ అదే గ్రామానికి చెందిన మరోక యువతి ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి ఆ యువతి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన  నిఖిల్ వారం రోజుల క్రితం ఎలుకల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఆస్పత్రిలో జాయిన్ చేశారు. వారం రోజులుగా అక్కడే చికిత్స పొందుతూ నిఖిల్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.