హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు... వ్యక్తి స్పాట్ డెడ్..

హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు... వ్యక్తి స్పాట్ డెడ్..

హైదరాబాద్ లోని మియాపూర్లో హిట్ అండ్ రన్ కేసు చోటు చేసుకుంది.. మియాపూర్ నుండి కూకట్ పల్లి వెళ్లే దారిలో పిల్లర్ నంబర్ 622 దగ్గర చోటు చేసుకుంది ఈ ప్రమాదం. ఈ ఘటనలో గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర రక్తస్రావమయ్యి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు.

ఈ ఘటనపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన పోలీసులు ఢీకొట్టిన వాహనం వివరాల కోసం సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.