భారీ ఆన్ లైన్ మోసం.. రూ.12 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి,

కామారెడ్డి జిల్లాలో భారీ ఆన్ లైన్ మోసం బయటపడింది. జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో నివాసం ఉండే సందీప్ అనే వ్యక్తి నవిక్యాష్, మనీవ్యూ, క్రిడీట్ బీ, పేటీఎం లకు చెందిన ఆన్ లైన్ యాప్ ల ద్వారా రూ.12 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బును డఫాబేట్ అనే యాప్ లో ఇన్వెస్ట్ చేశాడు. వివిధ దఫాలుగా ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాడు. అయితే వివిధ యాప్ ల ద్వారా లోన్ తీసుకున్న  డబ్బును తిరిగి చెల్లించక పోవడంతో బాధితుడికి.. అతని కుటుంబ సభ్యులకు రుణం ఇచ్చి యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారు.

దీంతో బాధితుడు సందీప్ అవమానం భరించలేక ఏప్రిల్ 7వ తేదీన ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆన్​లైన్ యాప్ లో భారీగా ఇన్వెస్ట చేసిన బాధితుడి తిరిగి లాభం రాకపోగా.. పెట్టిన సొమ్ము కూడా రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించి ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.