నాంపల్లి కోర్టు భవనం పై నుంచి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ఉస్మానియాకు తరలింపు

హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. నాంపల్లి కోర్టు భవనం పై నుంచి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి కిందకు దూకి ఆత్మహత్యయత్నానికి  పాల్పడ్డాడు. ఈయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడని చెబుతున్నారు పోలీసులు. 

సూసైడ్ అటెంప్ట్ చేసిన వ్యక్తిని వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. తీవ్ర గాయాలైన సలీముద్దీన్ కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మెహదీపట్నం ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన సలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. సెప్టెంబర్ 20న నాంపల్లి కోర్టులో పేషీ ఉండటంతో అతడిని తీసుకొచ్చారు.