ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. సీసీ కెమెరాల వైర్లను కట్ ​చేశాడు.. అంతలోనే అలారం మోగడంతో..

ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. సీసీ కెమెరాల వైర్లను కట్ ​చేశాడు.. అంతలోనే అలారం మోగడంతో..

శంషాబాద్, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలోని ఏటీఎంలో చోరీకి ఓ వ్యక్తి విఫల యత్నం చేశాడు. శంషాబాద్​ఎయిర్​పోర్ట్​ఇన్​స్పెక్టర్ బాలరాజు వివరాల  ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున దుండగుడు శంషాబాద్ బస్టాండ్ వద్ద గల సౌత్ ఇండియన్ బ్యాంకు ఏటీఎంలోకి చొరబడ్డాడు. సీసీ కెమెరాల వైర్లను కట్​చేశాడు. అనంతరం ఏటీఎం మెషీన్ను ధ్వంసం చేసి, అందులోని నగదు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు.

అంతలోనే అలారం మోగడంతో అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులకు సమాచారం అందడంతో రూరల్​ఇన్స్పెక్టర్​నరేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.