లిఫ్ట్ పేరుతో బైక్ ఎక్కించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు 

లిఫ్ట్ పేరుతో  బైక్ ఎక్కించుకుని ఓ అమ్మాయిపై లైంగిక దాడికి యత్నించాడు ఓ ప్రభుద్ధుడు. ఈ ఘటన గత ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో తార్నాకలో చోటుచేసుకుంది.  శ్రీధర్ అనే యువకుడు పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన ఆర్తి అనే యవతికి  లిప్డ్ ఇస్తానని చెప్పి బైక్ పై ఎక్కించుకున్నాడు.  

బైక్ ఎక్కి కొద్ది దూరం వెళ్లాక ఆర్తితో శ్రీధర్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.  రూమ్ కు వెళ్దాం పదా అని అసభ్యంగా మాట్లాడాడు. దీంతో భయపడిపోయిన  ఆర్తి బైక్ పై నుంచి దూకింది. ఈక్రమంలో  వెనుక నుంచి వస్తోన్న లారీ ఆమెను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆర్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.  దీంతో స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు . గత ఆరు రోజుల నుంచి ఆసుపత్రిలో  చికిత్స పొందుతోంది.  

ALSO READ:అక్షర చిట్ ఫండ్స్ మోసం..చిట్టీలు పూర్తయినా చెల్లించని వైనం

లైంగికంగా వేధించడం మూలంగానే తాను బైక్ పై నుండి దూకినట్లు యవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఓయూ పోలీసులు శ్రీధర్ ను అరెస్ట్ చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.