ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి..జీవించడం కష్టంగా మారింది..చేసేందుకు పనిలేదు..పూటగడవటం లేదు..దిక్కుతోచని స్థితి..ఏమిటీ ఇంత దుర్భరమైన జీవితం..పొట్ట చేతపట్టుకొని వందల కిలోమీటర్ల నుంచి బతుకు దెరువు కోసం వలస వచ్చిన కుటుంబం..బతుకు బండి లాగలేగ..కుటుంబ భారం మోయలేక.. భార్యాపిల్లలు ఊరెళ్లిన సమయం మూహూర్తంగా.. అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు..అందరూ చూస్తుండగానే వాటర్ పైకి ఎక్కి కిందకు దూకి ప్రాణాలొదిన ఓ అభాగ్యుడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుధవారం ఆగస్టు 21, 2024న జీడిమెట్ల-కుత్బుల్లాపూర్ పరిధిలో వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి రాము అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు..ఆర్థిక ఇబ్బందులు భరించలేక భార్యాపిల్లలు ఊరెళ్లిన సమయంలో రాము నివాసానికి సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి దూకాడు..రాము ట్యాంక్ పై నుంచి కిందకు దూకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.