కొన్నికొన్ని సార్లు..ఇష్టమైనవే ప్రాణాల మీదకు తెస్తుంటాయి. కోడి బొక్క గొంతులో ఇరుక్కుపోయి వ్యక్తి చనిపోయాడని ఇటీవల వార్తల్లో విన్నాం.తాజాగా ఇలాంటిదే ఓ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. తనకు ఎంతో ఇష్టమైన చకినాలు తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ విశిష్టమైన వంటకం చకినాలు తింటుండగా.. ఓ ముక్క గొంతులో ఇరుక్కొని మంచిర్యాలలోని హమాలివాడలో రంగారావు(65) మృతి చెందాడు. మంచిర్యాల ఎస్సై రాజేందర్ తెలిపిన వివరా ప్రకారం.. చకినాల ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఎన్ రంగారావు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రంగారావు అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. రాత్రి భోజనం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఎస్సై తెలిపారు. రంగారావు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.