కూసుమంచి, వెలుగు : మేడారం జాతరకు వెళ్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాధారం శివారులో ఆదివారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన బిక్షం(49) అనే వ్యక్తి ఫ్రెండ్స్‌తో కలిసి మేడారం జాతరకు బయలు దేరాడు.
నాలుగు బైకులపై ఎనిమిది మంది హుజూర్ నగర్ నుంచి వస్తున్నారు. ఈశ్వరమాధారం వద్దకు రాగానే బిక్షం గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు.