క్రికెట్​ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

  •  ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన

కూసుమంచి, వెలుగు: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు వచ్చి యువకుడు చనిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కూసుమంచి మండల కేంద్రంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్​టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నా రు. ఇందులో గ్రామానికి చెందిన తావాసి విజ య్(27) శుక్రవారం క్రికెట్ బ్యాచ్ లో భాగంగా బౌలింగ్​ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయా డు.  అతడిని టోర్నమెంట్ నిర్వాహుకులు వెంట నే ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. రాజశేఖర్, మహాలక్ష్మి దంపతులు తమిళనాడు నుంచి బతుకుదెరువు కోసం వచ్చి కూసుమంచిలో వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కొడుకులు కాగా.. విజయ్ చిన్నవాడు. ఐటీఐ చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. విజయ్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.