పోలీసులు కొట్టారని మనస్తాపం చెంది.. యువకుడు సూసైడ్ అటెంప్ట్

పోలీసులు కొట్టారని మనస్తాపం చెంది.. యువకుడు సూసైడ్ అటెంప్ట్

 

  • ఎస్ఐ, ఎమ్మెల్యేనే కారణమంటూ సెల్ఫీ వీడియోలో తెలిపిన బాధితుడు
     

  • డీజిల్ చోరీ చేశాడని పోలీసులకు కంప్లైట్ చేసిన క్రషర్ మిల్లు ఓనర్

  •  నల్గొండ జిల్లా ఆకారం గ్రామంలో ఘటన

తుంగతుర్తి, వెలుగు : చేయని తప్పుకు పోలీసులు కొట్టారని మనస్తాపం చెంది ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. వివరాల్లో వెళ్తే.. 

శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన శనిగల నాగరాజు (30 ) బాలాజీ క్రషర్ మిల్లులో టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనితో పాటు ఇతనితో పాటు మరో నలుగురు డ్రైవర్లుగా పని చేస్తున్నారు.  వీరంతా డీజిల్ చోరీ చేశారని క్రషర్ మిల్లు ఓనర్  గొలుసుల వెంకన్న శుక్రవారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నాగరాజుతో పాటు మరో నలుగురిని ఎస్ఐ వి. సురేశ్​స్టేషన్ కు పిలిపించి విచారించారు. 

అనంతరం నాగరాజు ఇంటికి వెళ్లిపోయి.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇదంతా తన ఫోన్ లో రికార్డైంది.“ నేను ఎన్నడూ పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదని.. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ ఫోన్ చేసి చెప్పడంతోనే ఎస్ఐ నన్ను బాగా కొట్టాడని.. నేను చనిపోతున్నాను” అని వీడియోలో తెలిపాడు. అతడు ఉరివేసుకున్నది చూసిన కుటుంబసభ్యులు వెంటనే రక్షించి నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడి పరిస్థితి సీరియస్ గా ఉంది.  ఘటనపై ఎమ్మెల్యే మందు సామేల్ స్పందిస్తూ.. తనకేం సంబంధం లేదని.. బాలాజీ క్రషర్ మిల్లు యజమాని గొలుసుల వెంకన్నను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తామని తెలిపారు. 

ఊఫేఎస్ఐ సురేశ్​ ను వివరణ కోరగా.. బాలాజీ క్రషర్ మిల్లులో ట్రిప్పర్ డ్రైవర్లు డీజిల్ చోరీ చేశారని ఓనర్ గొలుసుల వెంకన్న ఫిర్యాదు మేరకు డ్రైవర్ నాగరాజుతో పాటు మరో నలుగురిని తీసుకొచ్చి విచారించామని, కానీ ఎలాంటి దెబ్బలు కొట్టలేదని తెలిపారు. తమ విచారణలో డీజిల్ చోరీ చేసినట్లు తేలిందని ఓనర్ తో మాట్లాడుకుని తప్పును సరిదిద్దుకుంటామని చెప్పారని ఎస్ఐ పేర్కొన్నాడు.