
దావత్ ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగినందుకు సెల్ టవర్ ఎక్కాడు ఓ యువకుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటుచోసుకుంది. నర్సింహులు అనే వ్యక్తి తన భార్యకు తెలియకుండా ఇంట్లో ఉన్న రూ.20 వేలు తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి దావత్ ఇచ్చాడు. డబ్బులు ఏమాయ్యాయని నర్సింహులును ఆమె భార్య నిలదీయగా అసలు విషయం చెప్పాడు.
దీంతో నర్సింహులు స్నేహితుడు మహేష్ కు ఫోన్ చేసిన ఆమె.. మీకు తన భర్త ఇచ్చిన దావత్ డబ్బులని వెంటనే ఇవ్వాలని అడిగింది. లేకుంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో భయపడిన మహేష్ సెల్ టవర్ ఎక్కి తోటి స్నేహితులకి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. దీంతో మహేష్ కి తోటి స్నేహితులు, పోలీసులు నచ్చజెప్పి కిందికి దింపారు .