తాగొద్దన్నందుకు సూసైడ్ అటెంప్ట్

ఎల్ బీనగర్,వెలుగు: మద్యం తాగొద్దని కుటుంబసభ్యులు మందలించడంతో ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. చైతన్యపురి పోలీసులు తెలిపిన ప్రకారం.. సైదాబాద్ కు చెందిన తాళ్లపల్లి రమేశ్​కు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో అతడిని మద్యం తాగొద్దని భార్యాపిల్లలు మందలించేవారు. శుక్రవారం ఉదయం కూడా రమేశ్​మద్యం తాగాడు. 

దీంతో మరోసారి మందలించగా మనస్తాపం చెందిన అతడు చైతన్యపురిలోని విద్యుత్ నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న 3 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కాడు. అక్కడి నుంచి దూకుతానని చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వెళ్లిన పోలీసులు రమేశ్​ను మభ్యపెట్టి చాకచక్యంగా కిందకు దించి ప్రాణాలు కాపాడారు.