హైదరాబాద్లో దారుణం భార్యను అతి కిరాతకంగా నరికిన భర్త

హైదరాబాద్లో దారుణం భార్యను అతి కిరాతకంగా నరికిన భర్త

హైదరాబాద్ లో దారుణం జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా హత్య చేయబోయాడు. వివరాల్లోకి వెళ్తే చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ MIGలో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. కొన్ని రోజులుగా భర్త భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే భార్య భర్తలకు మధ్య గొడవ జరగింది. భార్యను భర్త అతి కిరాతకంగా కత్తితో నరికాడు. 

తీవ్ర రక్త స్రావంతో భార్య ప్రాణాలతో కొట్టిమిట్టాడింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.భార్యను సిటిజెన్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలస్తుంది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.