పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటుంటారు కదా.. ఈ సామెతకు సరిగ్గా మాచ్ అవుతాడు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి. గబ్బు సాక్సులతో ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. అదెలాగో చదవండి. సాక్సుల నుంచి వచ్చే గబ్బు వాసనని అస్సలు భరించలేం. అలాంటిది ఓ వ్యక్తి రోజుల తరబడి అదే పనిగా వాటి వాసన చూస్తూ గడిపాడు. ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే... చైనా 'జాంగ్ ఝౌ' ప్రాంతానికి చెందిన యువకుడు ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అదేం ఆనందమోగానీ రోజూ ఆఫీస్ నుంచి వచ్చాక తన కంపు సాక్సుల వాసన పీల్చేవాడట. అలా కొన్నాళ్లు గడిచాక అతని ఆరోగ్యం పాడై ఆస్పత్రి పాలయ్యాడు. ఎక్స్ రే రిపోర్ట్ ద్వారా అతని ఊపిరితిత్తులు దారుణంగా చెడిపోయాయని వైద్యులు తేల్చారు. సాక్సుల వాసన వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందట.
ALSO READ | Good Health : జింక్తో రోగాలకు చెక్
ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఏడాది మొదట్లో ఇట్లాంటి కేసు ఒకటి అమెరికాలో నమోదైంది. ఓ చిన్నారి తన తండ్రి సాక్సుల వాసనను పదే పదే పీల్చి అనారోగ్యానికి గురైంది. పేరెంట్స్ సకాలంలో స్పందించే సరికి ప్రాణాలతో బయటపడింది.