తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. జల ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలు నీట మునగటంతోపాటు.. గ్రామాల మధ్య రహదారులు అన్నీ నీటి ప్రవాహాన్ని తలపిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. కొంత మంది అత్యుత్సాహంగా.. ఏమీ కాదులే అన్నట్లు తెగించేసి దాటేస్తున్నారు. అలాంటి ప్రయత్నమే చేసి ఓ వ్యక్తి గల్లంతు అయిన ఘటన హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం వాగుపై జరిగింది.
మహేందర్ అనే వ్యక్తి బైక్ పై వెళుతున్న సమయంలో.. కన్నారం వాగు దాటాల్సి వచ్చింది. అప్పటికే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. అత్యవసర సమయంలో జనం.. వాగు దాటేందుకు తాడు కూడా కట్టారు గ్రామస్తులు. ఇదే సమయంలో మహేందర్ అనే వ్యక్తి.. తన బైక్ తో సహా కన్నారం వాగు దాటేందుకు బయలుదేరాడు.. ఇటు నుంచి అటు వైపు చాలా జాగ్రత్తగా రైడ్ చేసుకుంటూ వెళ్లాడు.. మరో నాలుగు అడుగుల దూరంలో గట్టు ఎక్కేస్తాడు అనుకున్న సమయంలో.. బండి బ్యాలెన్స్ తప్పింది. అంతే బైక్ తో సహా వాగులో పడిపోయాడు.
బైక్ అయితే వెంటే వాగులో కొట్టుకుపోయినా.. మహేందర్ మాత్రం ఓ చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. దాని ద్వారా పైకి వద్దామని చేసిన ప్రయత్నంలో.. ఆ కొమ్మ ఊడి చేతికి వచ్చింది.. అంతే కళ్ల ముందే మహేందర్ వాగులో కొట్టుకుపోవటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం మహేందర్ పరిస్థితి ఏంటీ.. ఎక్కడ ఉన్నాడు.. సురక్షితంగా ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అతని కోసం అధికారులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు.
Telangana Rains : హన్మకొండ జిల్లా వేలూరు మండలం కన్నారం వాగు దాటుతూ బైక్ తో సహా కొట్టుకుపోయిన మహేందర్ అనే వ్యక్తి. అతను సుక్షితంగా ఉన్నాడా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. అతని కోసం గాలింపు జరుగుతుంది. #TelanganaRains #RainAllert #HyderabadRains pic.twitter.com/Eqv0N9DpNw
— raghu addanki (@raghuaddanki1) July 27, 2023