పాస్టర్​ బతికిస్తాడని.. చనిపోయిన తల్లి డెడ్​బాడీతో చర్చికి-

చనిపోయిన తల్లిని బతికిస్తాడని మంచిర్యాల జిల్లా సోమగూడేం కల్వరి చర్చికి హైదరాబాద్ ​నుంచి డెడ్​బాడీని శుక్రవారం ఓ కొడుకు తీసుకురావడం హాట్​టాపిక్​గా మారింది.  ఏపీలోని రాజమండ్రికి చెందిన మణికుమారి హైదరాబాద్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ గురువారం చనిపోగా చర్చి పాస్టర్​ ముట్టుకుంటే బతుకుతుందని, ప్రార్థనలు చేస్తే స్వర్గానికి వెళ్తుందని సోమగూడం కల్వరీ మినిస్ట్రీకి అంబులెన్స్​లో తీసుకొచ్చారు.

 ఈ క్రమంలో చర్చి సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో పాటు సమీపంలో ఉండేందుకు నిరాకరించారు.  దీంతో పాత బెల్లంపల్లి రోడ్డు వద్ద వెహికల్​ నిలిపి వేచి చూశారు. స్థానిక మీడియాకు తెలియడంతో అక్కడికి వెళ్లగా..   తన తల్లి చనిపోయిందని ఇక్కడి పాస్టర్​ దైవసమానుడు అని టీవీల్లో ప్రచారం, ప్రార్థనలు చూసి నమ్మకంతో వచ్చినట్లు కొడుకు తెలిపారు.  విషయం తెలుసుకున్న కాసీపేట ఎస్సై గంగారాం వారికి నచ్చజెప్పి తిప్పి పంపించారు.