కత్తులు, తల్వార్ల తో బర్త్ డే సెలబ్రేషన్స్

హైదరాబాద్ : కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి బర్త్ డే వేడుక వివాదంగా మారింది. రిజ్వాన్ అనే యువకుడు తన బర్త్ డే వేడుకల్లో తల్వార్లతో డ్యాన్స్ చేశాడు. రిజ్వాన్ తో పాటు అతని స్నేహితులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని డ్యాన్సులు చేశారు. కత్తులు, తల్వార్లు చేతపట్టుకుని డ్యాన్స్ లు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో కేసు నమోదు చేశారు. రిజ్వాన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. అయితే.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 10న రిజ్వాన్ బర్త్ డే వేడుక జరిగిందని చెబుతున్నారు.