
హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. కూకట్ పల్లి బాల్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న నవవధువు పెళ్లైన నెలకే సూసైడ్ చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలన సృష్టించింది.
విజయనగరం జిల్లాకు చెందిన విజయగౌరీకి ఫిబ్రవరి 6న ఈశ్వర రావు తో వివాహం జరిగింది. ఇద్దరూ కూకట్ పల్లి బాల్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నారు. ఈశ్వర్ రావు ప్రైవేట్ జాబ్ చేస్తుండగా.. అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది.
శుక్రవారం (మార్చి7) రాత్రి విజయగౌరీ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు సమాచారం అందిచడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇష్టం లేని పెళ్లి చేసినందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.