వరకట్న వేధింపులతో కూకట్పల్లిలో మహిళ ఆత్మహత్య

వరకట్న వేధింపులతో కూకట్పల్లిలో మహిళ ఆత్మహత్య

కూకట్ పల్లిలో కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులతో దీపికా అనే వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా దమ్మన్నపేటకు చెందిన అప్పాల వేణుగోపాల్ తో.. హనుమకొండ  సింగరాజుపల్లికి చెందిన కొసనం దీపిక (27)కు 2019 లో వివాహమైంది. వీరికి 13 నెలలు కుమారుడు ఉన్నాడు.  నిజాంపేట రోడ్డులోని నాగార్జున హోమ్స్ లో నివాసం ఉంటున్నారు. 

వివాహమైన ఏడాది నుంచే తరచూ గొడవలు పడుతుండేవారని స్థానికులు తెలిపారు. అదనపు కట్నం కోసం దీపికతో వేణుగోపాల్ గొడవకు దిగేవాడని చెబుతున్నారు.

మంగళవారం (ఫిబ్రవరి 18) సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మృతురాలి భర్త, అత్తమామల పైన కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు.