నార్సింగి పోలీస్ స్టేషన్ లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకుంది. మై హోమ్ అవతార్ బిల్డింగ్14 వ ప్లోర్ నుండి కిందకు దూకి బలవన్మరణంకు పాల్పపడింది . ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఆత్మహత్యకు గల కారణాల పై ఆరా తీస్తున్నారు పోలీసులు.