Mississippi Nightclub: నైట్ క్లబ్లో కాల్పులు.. ముగ్గురు టీనేజర్స్ స్పాట్ డెడ్..

Mississippi Nightclub: నైట్ క్లబ్లో కాల్పులు.. ముగ్గురు టీనేజర్స్ స్పాట్ డెడ్..

మిసిసిపీ: అమెరికాలోని మిసిసిపీలో ఘోరం జరిగింది. నైట్ క్లబ్ లో దుండగుల కాల్పులు జరపడంతో ముగ్గురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. టీనేజర్ల వయసు 19 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం ఈ కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ కాల్పుల్లో 16 మంది గాయపడ్డారు. కాల్పులకు కారణాలు తెలియలేదు. మిసిసిపీలోని ఇండియనొల (indianola) సిటీలోని ఒక నైట్ క్లబ్ లో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. దగ్గర దగ్గర 12 సార్లకు పైగా కాల్పుల శబ్దం వినిపించిందని, కొందరు బాధితులకు బుల్లెట్స్ నేరుగా తగలడంతో తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. పోలీసులు ఈ ఘటన జరిగిన వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. వెస్ట్ ఫిలడెల్ఫియాలో ఈ తరహా కాల్పులు ఘటనే ఇటీవల జరిగింది. ఈ ఘటనలో కూడా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు. ఆల్డెన్ స్ట్రీట్లో ఈ ఘటన జరిగింది. 

ALSO READ | బుల్లెట్లు తిన్న డెమోక్రాట్ల విమర్శలకు ట్రంప్ కౌంటర్

ఇటీవల అమెరికాలో కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. భారతీయ సంతతికి చెందిన 29 ఏళ్ల యువకుడిని ఒక రోడ్ రేజ్ ఘటనలో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ యువకుడికి జూన్ 29నే పెళ్లైంది. ఇండియానాలో ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూఎస్లో గన్ కల్చర్పై నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేశారు. ఆగ్రాకు చెందిన దసౌర్ అనే ఈ యువకుడు జూన్ 29న వివిన జమోరా అనే యువతిని వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న రెండు వారాలకే దసౌర్ను కాల్చి చంపేయడం శోచనీయం.