
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుషాయిగూడల్ పారిశ్రామిక వాడల భారీ పేలుడు జరిగింది. ట్రాక్టర్ పై చెత్తు నింపుతుండగా కెమికల్ బ్లాస్ట్ అయ్యింది. దీంతో చెత్త ఎత్తుతున్న కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ లోని స్మాల్ స్కిల్ ఇండస్ట్రియల్ లో మార్కి 22 న సాయంత్రం సాడక్ నాగరాజు అనే కార్మికుడు (లేబర్) చెత్తను తొలగిస్తున్నాడు. ఆ సమయంలో చెత్త తొలగిస్తుండగా కొన్ని కెమికల్స్ వల్ల ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. దానితో నాగరాజు అక్కడికక్కడే చనిపోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగరాజు మృత దేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ గుర్తు తెలియని కెమికల్స్ ను ఆ ప్రదేశంలో ఎవరు వేశారు, ఆ కెమికల్ ఏంటనే విషయం దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సీహెచ్ సాయిలు తెలిపారు.