హైదరాబాద్: షేక్‌పేట్ జుహి ఫెర్టిలిటీ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న ఆకాష్ స్టడీ సెంటర్‌కి మంటలు వ్యాపించాయి. అదే బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో రిలయన్స్ ట్రెండ్స్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ వైపు మంటలు వ్యాపిస్తున్నాయి. మంటల కారణంగా దట్టంగా పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. భారీ పొగతో రెస్క్యూ ఆపరేషన్‌కి ఇబ్బందులు తలెత్తాయి. ఫైర్ ఫైటర్స్ అద్దాలు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
* ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ వద్ద ఉన్న ఆకాష్ ఇన్స్టిట్యూట్లో మంటలు అంటుకొని కింద ఫ్లోర్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్కు వ్యాపించిన మంటలు
* ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయని, రిలయన్స్ ట్రెండ్స్లో మాత్రం పాక్షికంగా మంటలు అంటుకున్నాయని.. పెద్ద నష్టం ఏమీ వాటిల్లలేదని తెలిపిన పోలీసులు
* తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం
* ఘటనా స్థలానికి మూడు ఫైర్ ఇంజన్లు.. మంటలను ఆర్పివేయడంతో అదుపులోకి వచ్చిన పరిస్థితి
*పక్కనే ఉన్న డీమార్ట్కు ఎలాంటి ప్రమాదం వాటిల్ల లేదని వెల్లడించిన పోలీసులు
*షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణం అయ్యి ఉండవచ్చని అనుమానం
* తెల్లవారుజామున కావడంతో అదృష్టవశాత్తూ ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు