హైదరాబాద్ : ఉస్మానియా హాస్పిటల్ దగ్గర అగ్నిప్రమాదం జరిగింది. గోల్డెన్ జూబ్లీ బ్లాక్ ఎదురుగా ఉన్న బేగంబజార్‌లోని ఓ బంగారం దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే ఘటనా స్థలానికి మూడు ఫైరింజన్లు చేరుకున్నాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు.
పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఫైర్, పోలీసులు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.