డిచ్పల్లి, వెలుగు : డిచ్పల్లి మండలం ఘన్‌పూర్‌లో శనివారం వేకువజామున భారీ దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంట్లో నుంచి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. డిచ్పల్లి ఎస్ఐ గణేశ్తెలిపిన వివరాల ప్రకారం ఘన్పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ఇటీవల గల్ఫ్‌నుంచి వచ్చాడు. ఇంటికి తాళం వేసి, కొన్ని రోజుల కింద ఫ్యామిలీ తో కలిసి కరీంనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. దుండగులు ఇంటి తాళం పగలగొట్టి రూ.10 లక్షల నగదు, 7 తులాల గోల్డ్, వెండి ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐగణేశ్ చెప్పారు.
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాకేంద్రంలోని గాంధీ గంజ్ఏరియాలో ఉన్న శ్రీరాఘవేంద్ర ట్రేడర్స్‌లో శనివారం తెల్లవారు జామున దొంగలు చోరీకి యత్నించారు. ఉదయం షాప్తెరవడానికి వచ్చిన ఓనర్శశి, షెటర్ తెరిచే ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. టౌన్‌సీఐ నరేశ్, క్లూస్‌టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చి, చోరీకి ప్రయత్నాలు చేసినట్లు పుటేజీలో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. షెటర్ ధ్వంసం చేసే టైంలో అటువైపు వేరే వ్యక్తులు రావడంతో పారిపోయినట్లు తెలిపారు.