
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 70 తులాల బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ సరస్వతి శిశు మందిర్ ఎదురుగా ఉన్న అశోక్ విహార్ అపార్ట్‌మెంట్ లో నివసిస్తున్న ఓ బిల్డర్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. పని మనిషిపై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.